Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానా పెళ్లిపై శ్రీరెడ్డి స్పందన!

Sri Reddy response on Rana marriage
  • మిహీకా బజాజ్ ను పెళ్లాడబోతున్న రానా
  • రానాకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • ప్రశాంతమైన జీవితం ఉండాలని కోరుకున్న శ్రీరెడ్డి
త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు సినీ హీరో రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు మిహీకా బజాజ్ ను రానా పెళ్లాడబోతున్నాడు. పెళ్లి ఏర్పాట్ల ప్లానింగ్ లో ఉన్నట్టు రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు కూడా వెల్లడించారు. రానా, మిహీకాలకు ఇంతకు ముందు నుంచే పరిచయం ఉందని చెప్పారు.

మరోవైపు, బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలుకుతున్న రానాకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద నటి, ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించింది. 'మీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు. ఆ అమ్మాయితో మీకు ప్రశాంతమైన జీవితం ఉండేలా భగవంతుడు దీవిస్తాడు' అంటూ ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.
Sri Reddy
Rana
Tollywood
Marriage

More Telugu News